చంద్రబాబుకి జైరాం రమేష్ ప్రచారం?

 

 

 

కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి, రాష్ట్ర విభజన సూత్రధారి జైరాం రమేష్ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచారం చేయడమేంటి? ఆశ్చర్యంగా వుంది కదూ? ఇది పాక్షికంగా నిజం. అదెలాగంటే, ప్రస్తుతం సీమాంధ్రలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి వినిపిస్తున్న పేర్లు రెండే రెండు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు, మరొకరు వైసీపీ నేత జగన్.

 

ఈ ఎన్నికల తర్వాత జగన్ సీఎం కావడం కాదు.. చంచల్‌గూడాలో పర్మినెంట్‌గా సెటిల్ కావడం ఖాయమని ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమైపోతోంది.  అందువల్ల ఈసారి చంద్రబాబుకే ముఖ్యమంత్రి పట్టం కట్టాలని సీమాంధ్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. జగన్‌ పార్టీకి ఓటు వేయొద్దని కనిపించినవాళ్ళందరికీ చెబుతున్నారు.



ఇప్పుడు జైరాం రమేష్ కూడా చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. జైల్లో వుండి బయటకి వచ్చిన జగన్‌కి ఓటేయొద్దు అని గత వారం పదిరోజులుగా అయన అనేకసార్లు చెబుతూ వస్తున్నారు. జగన్‌కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని ఆయన చెబుతున్నారు తప్ప.. కాంగ్రెస్‌లో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత వుందో ఆయన చెప్పలేకపోతున్నారు. జైరాం రమేష్ తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారోగానీ ఆయన  పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.