ఆ ఒక్క విషయం మాత్రం అడగను..!

 

ఏపీ ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇంత పోరాటం చేస్తున్నా... కేంద్రం మాత్రం మరోసారి ఏపీకి షాకిచ్చింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం.. ఎన్ని ఉద్యమాలు చేసినా హోదా సాద్యం కాదంటూ తేల్చి చెప్పేశారు. గతంలో ప్రకటించిన ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని మొండిచెయ్యే చూపించింది. దీంతో రెండు పార్టీలు ఏ క్షణంలో అయినా విడిపోవచ్చు అనే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ రోజు అసెంబ్లీలో విభజన హామీలపై మాట్లాడిన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురుడు పోసి తల్లిని చంపేశారని అప్పట్లో మోడీ అన్నారు..ఆ విషయమే ఇప్పుడు అడిగాను.. కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిందే.. ఎలాంటి రాజీ లేదు అని అన్నారు. అంతేకాదు...  రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన భాజపా ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.  14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని ఇప్పుడు భాజపా అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఇప్పుడు ఏయే రాష్ట్రాలకు ఎంతమేర నిధులు, సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

 

అయితే ఒక్క విషయాన్ని మాత్రం నేను అడగదలుచుకోలదని అన్నారు. ఇంతకీ ఆ ఒక్క విషయం ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. అసెంబ్లీ సీట్ల పెంపు.. దీనిపై కూడా చంద్రబాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ సీట్లు పెంచమని విభజన చట్టంలో ఉందని... కాని ఈ విషయాన్ని తాను అడగదల్చుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు... ఇలా అడిగితే మళ్ళీ రాజకీయం చేస్తున్నా అంటారు... అన్ని విషయాలు వదిలేసి, ఇదే అడుగుతున్నా అంటారు... ఇది ఇవ్వకపోయినా పరవాలేదు, మిగతా అన్ని విభిజన హామీలు నెరవేర్చండి అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసారు.. నేను 29 సార్లు దిల్లీకి వెళ్లాను. అందరినీ కలిశాను. పదేపదే విజ్ఞప్తి చేశానన్నారు. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్లీ మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనేనని ప్రకటనలు చేసే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మరి కేంద్రం అయితే ఇవ్వమని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు చంద్రబాబు మాటలకు మారిపోతారా..?