ఆనాడు చంద్రబాబు చెప్పబట్టే...నోర్లు మూయించిన అంబానీ..

 

మన గొప్పతనాన్ని మనం  చెప్పుకోవడం కంటే.. పక్కన వాళ్లు చెబితేనే దానికో అర్దం ఉంటుంది. అందులో ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులైన వాళ్లు.. మన గొప్పతనాన్ని చెబితే.. ఎలా ఉంటుంది... అబ్బో అది చెప్పడానికే మాటలుండవు. అలాంటి పరిస్థితే ఎదురైంది చంద్రబాబుకి. ఇంతకీ పొగిడిన వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు ముకేష్ అంబానీ. అసలు మ్యాటరేంటంటే.. ముకేష్ అంబానీ అమరావతిని సందర్శించిన సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు గురించి పొగిడారు. 1999లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జామ్‌నగర్‌లోని మా రిఫైనరీని సందర్శించారు. అప్పుడు మా నాన్న ధీరూబాయ్‌ అంబానీతో మాట్లాడారు. టెలికాం రంగంలోకి వస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చారు. ఆ రంగం ఊహించనంత ఎదుగుతుందని చెప్పారు. ఆ సలహాతోనే మా నాన్న టెలికాంవైపు అడుగు వేశారు. ఆ రకంగా రిలయన్స్‌ కంపెనీ చంద్రబాబుకు రుణ పడి ఉండాలి’’ అంటూ ప్రశంసలు కురిపించారు.

 

దీంతో చంద్రబాబు స్థాయి ఏంటో మరోసారి అర్దమైంది. గతంలో మైక్రో సాఫ్ట్ హైదరాబాద్ తెచ్చింది నేనే అంటే ఎగతాళి చేసారు... చివరకు స్వయానా మైక్రో సాఫ్ట్ అధినేతే వైజాగ్ వచ్చి, ఆ రోజుల్లో చంద్రబాబు పడిన కష్టం చెప్పి, హైదరాబాద్ రావటానికి చంద్రబాబు ఏమి చేసింది చెప్పారు. దాంతో అప్పుడు విమర్శించిన వాళ్ల నోర్లు మూతపడ్డాయి. ఇక హైదరాబాద్ ఐటీ గురించి చెప్పక్కర్లేదు. ఈరోజు హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందంటే.. దానికి కారణం చంద్రబాబే అని ఏ ఒక్క ఐటీని అడిగినా చెబుతారు. కానీ నిజాన్ని ఒప్పుకోలేని కొంతమంది ఉంటారు కదా. దానికి కూడా వాళ్లు చంద్రబాబుపై కామెంట్లు చేస్తారు. చివరకు ప్రత్యర్ధి అయిన తెలంగాణా ఐటి మంత్రి కేటీఆర్ స్వయంగా ఈరోజు హైదరాబాద్ ఐటీలో ఇలా ఉందంటే ఆ ఘనత చంద్రబాబుదే అని చంద్రబాబును విమర్శించే వాళ్ల చెంపమీద కొట్టినట్టు సమాధానం చెప్పారు. ఇప్పుడు తాజాగా ముకేష్ అంబానీ మరోసారి అలాంటి వాళ్ల నోరు మాయించారు. ఆ రోజుల్లో టెలికాం రంగంలో రెవల్యుషన్ గురించి వాజ్ పేయ్ కి నేనే సలహా ఇచ్చా అంటే.ఎగతాళి చేశారు. నిన్న ముకేష్ అంబానీ... ఈరోజు టెలికాం రంగంలో ఇలా ఉన్నామంటే దానికి చంద్రబాబే కారణమని చెప్పారు. అది చంద్రబాబు స్థాయి. మరి అంబానీ ప్రశంసలు చూసిన తరువాత చంద్రబాబుపై ఎటకారంగా కామెంట్లు చేసేవాళ్లు తలలు ఎక్కడ పెట్టుకుంటారో మరి. కొంతమంది నాయకులు ప్రజలకు ఉపయోగపడే పనులు వాళ్లు చేయరు...ఇతరులు చేస్తే  పనికి మాలిన విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటివాళ్లకు ఇప్పటికైనా చంద్రబాబు కెపాసిటీ ఎంటో అర్ధమై ఉండాలి.. అర్దంకాకపోతే ఇలానే వేరే వాళ్లు నోరు మూయిస్తారు. మరి చంద్రబాబుపై ఆలోచించకుండా ఇప్పటికైనా విమర్శలు గుప్పించడం ఆపేస్తే బెటర్.