దేవాన్ష్ పుట్టినరోజు..చంద్రబాబు 20 లక్షల విరాళం
posted on Mar 21, 2016 2:46PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనవడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మిణిల కొడుకు దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. అంతేకాదు నారా లోకేశ్ దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తన ట్విట్టర్లో.. దేవాన్ష్‌కు ఏడాది పూర్తయిందని, నిన్ను చూస్తుంటే టైం అలా గడిచిపోతోందని, హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశాడు.

కాగా రాజకీయాలతో బిజీగా ఉంటున్న చంద్రబాబు గత ఏడాది చివర్లో మాట్లాడుతూ... నవ్యాంధ్ర ఏపీగా రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నానని, కనీసం మనవడితో ఆడుకోలేకపోతున్నానని చెప్పారు. మనవడితో ఆడుకోవాలని మనసు తహతహలాడుతోందన్నారు. అయినా వీలు చిక్కడం లేదన్నారు. ప్రజా జీవితంలో కొన్ని త్యాగాలు తప్పవని చెప్పారు.