బొగ్గు స్కాంలో సిబిఐ vs ప్రభుత్వం

 

బొగ్గు కుంభకోణంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరుతో కేంద్ర ఇరుకున పడేలా ఉంది. కోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ఈ కేసులో అధికారులను విచారించడానికి తమకు ఎటువంటి ప్రభుత్వ పర్మిషన్‌ అవసరం లేదని సిబిఐ వాదిస్తొంది అయితే ప్రభుత్వం మాత్రం తమ అనుమతితోనే విచారణ చేపట్టాలని పట్టుబడుతుంది.

ఈ వివాదానికి సంబందించి మంగళవారం సుప్రిం కోర్టుకు ఆరు పేజీల అఫిడవిట్‌ దాఖలు చేసింది సిబిఐ. గతంలో 2జి  స్కాం విచారణ సమయంలో కూడా కోర్టు ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్న విషయాన్ని ఈ అఫిడవిట్‌లో గుర్తు చేసింది.

కాని ప్రభుత్వం మాత్రం కోర్టు పర్యవేక్షిస్తున్న కేసులో కూడా విచారణకు తమ అనుమతి తీసుకోవాలంటూ న్యాయస్ధానానికి స్పష్టం చేసింది. అయితే దీనిపై సిబిఐ తీవ్రం అభ్యతరం తెలిపింది. ఇలా చేయడం  కోర్టులకు ఉన్న అధికారాలను ప్రశ్నించడమే అవుతుందని వాదించింది.