లంచం తీసుకున్నాడని..ఐఏఎస్ భార్య, కుమార్తె ఆత్మహత్య

కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా పరిచేస్తున్న బి. బన్సాల్ ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.9 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇది జరిగి రెండు రోజులు తిరగకుండానే తూర్పు ఢిల్లీలో నివసిస్తున్న బన్సాల్ భార్య సత్యబాల, ఆయన కుమార్తె నేహ ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి వారిద్దరూ వేర్వేరుగా రాసిన రెండు సూసైడ్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అయితే బన్సాల్ అరెస్ట్‌తో మనస్తాపానికి గురైన వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu