ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాం... సర్వీస్ ప్రొవైడర్లు

నోటుకు ఓటు కేసులో మరో కీలకమైన అంశం బయటపడింది. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడినప్పటినుండి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు.. ఫోన్ ట్యాపింగ్ జరపలేదు అని తెలంగాణ అధికార నేతలు వాదిస్తునే ఉన్నారు. అయితే ఈ విషయంలో వెనుకకు తగ్గని ఏపీ ప్రభుత్వం మాత్రం దాని నిగ్గు తేల్చేందుకు రంగలోకి దిగి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారలు విజయవాడలో సర్వీస్ ప్రొవైడర్లను ప్రశ్నించగా.. వారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనని.. పక్కా ప్లానింగ్ తో రెండు నెలలుగా ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. రెండు నెలలుగా ఏపీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని.. అది కూడా కంపెనీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల వెల్లడి.

 

మరోవైపు సిట్ అధికారులు ఎవరి ఫోన్లు ఎప్పటి నుండి ట్యాపింగ్ చేశారు.. ఎంతకాలం ట్యాపింగ్ చేశారు అని సర్వీస్ ప్రొవైడర్లను అడుగగా.. దాని గురించి స్పష్టంగా తెలియాలంటే ఇంకా సమయం పడుతుందని.. ఆ సమాచారం తెలిపేందుకు కొంత గడువు కావాలని కోరారట. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని సర్వీస్ ప్రొవైడర్లు చెప్పగా సిట్ అధికారులు ఇప్పుడు ఆకోణంలో దర్యాప్తుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu