ఏ భార్య పై ప్రమాణం చేస్తావు?: రేవంత్

 

 

 brother anil revanth reddy, revanth reddy brother anil, revanth reddy tdp, brother anil assets

 

 

మొదటి భార్యను మోసం చేసి రెండో భార్యను చేసుకున్నావు. ఇప్పుడు అక్రమాల ఆరోపణలు వస్తే బైబిల్ మీద, భార్యాపిల్లల మీద ప్రమాణం చేస్తా అని అంటున్నావు. మరి ఏ భార్యా బిడ్డల మీద ప్రమాణం చేస్తావు. మొదటి భార్య, పిల్లల మీదా ? రెండో భార్యా పిల్లల మీదా” అని వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

 

బ్రదర్ అనిల్ కుమార్ చేసే ప్రమాణాల మీద నమ్మకం లేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిగానీ అక్రమాలు చేయలేదని షర్మిల, భారతి, విజయమ్మ, అనిల్ లు బైబిల్ మీద ప్రమాణం చేస్తారా ? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్, బ్రదర్ అనిల్ కుమార్ లు అబద్దాలు చెప్పడం మాని నిజాలు వెల్లడిస్తే వారికి కొంత శిక్ష అయినా తగ్గుతుందని అన్నారు. రాజకీయాలు, మత ప్రచారంతో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, మత ప్రచారమా, రాజకీయాలా ? ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని సూచించారు.