చంద్రబాబు నివాసానికి బాంబు బెదరింపు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన ఈ మెయిల్ బెదరింపు కలకలం సృష్టించాయి. అలాగే ఈ నెల 6న చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. ఆ తిరుపతిలోని పలు ప్రాంతాలకు కూడా ఇదే ఉగ్ర సంస్థ నుంచి బెదరింపు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసాలు సహా రాష్ట్రంలోని పలు కీలక ప్రదేశాలలో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ ఈమెయిల్స్ రావడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

 ఇటీవల రాష్ట్రంలో అనుమానికత ఉగ్రవాదుల అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులు జరిగిన రోజుల వ్యవధిలో సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వ్యక్తులు, ప్రసిద్థ తిరుపతి ఆలయాలు లక్ష్యంగా బాంబు పేలుళ్ల బెదరింపులు రావడం కలకలం రేపింది.   హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ అనే  ఉగ్ర సంస్థ నుంచి ఈ బెదరింపులు వచ్చాయి.  రాష్ట్ర వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లుగా ఈమెయిల్స్ ద్వారా హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ సంస్థ హెచ్చరించింది.

ఈ బెదరింపు ఈమెయిల్స్ లో పోలీసులు అలర్టయ్యారు. చంద్రబాబు, జగన్ నివాసాలు సహా తిరుపతిలోని పలు ప్రదేశాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు.  6న చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరుపతి, కాళహస్తి సహా పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు.కాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ ఈమెయిల్స్ బెదరింపుల వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థకు పంపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu