బాంబు పేలుళ్ళ లో 48 మంది మృతి, 150 మంది గాయాలు

 

 

 

 Bomb blast in Karachi , Pakistan Karachi bomb blast, Karachi shuts down to bury 45 bomb dead

 

 

ఆదివారం పాకిస్తాన్ లోని కరాచి నగరం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 48 మంది మృతి చెందగా, 150 మంది గాయపడ్డారని తెలుస్తోంది. మృతులలో మహిళాలు, పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు. పేలుళ్లలో గాయపడిన వారిని జిన్నా, అబ్బాసీ షహీద్ ఆస్పత్రులకు తరలించారు. ఘటనస్థలం నుంచి ఎనిమిది మృతదేహాలను గుర్తించారు. కొన్ని మృతుదేహాలు ముక్కలుగా పడివున్నాయి. ఈ పేలుళ్ల లో 150 వరకు దుకాణాలు కాలిపోయాయి.

 
సాయంత్రం ఏడు గంటల సమయంలో అబ్బాస్‌లోని ఇమాంబర్గా(షియాల ప్రార్థనా మందిరం) వెలుపల మొదటి బాంబు పేలింది. ప్రార్థనలు ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో పేలుడు సంభవించింది. కారులో పేలుడు పదార్థాలు ఉంచి పేల్చివేసినట్టు తెలుస్తోంది. రెండో బాంబు కూడా పది నిమిషాల సమయంలో ఆ సమీపంలోనే పేలింది. రెండోసారి పేలిన బాంబు తీవ్రత ఎక్కువగా ఉందని అక్కడి వారు చెబుతున్నారు. ఇది మానవ బాంబుగా తెలుస్తోంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu