అలహాబాద్ లో బాంబు పేలుడు: 6మంది మృతి
posted on May 23, 2012 5:48PM
ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో బాంబు పేలుడు సంభవించింది. క్రూడ్ బాంబు పేలిన ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు మరణించినట్లు సమాచారం, మరో డజన్ మంది గాయపడినట్టు తెలిసింది. బాధితులు ఎక్కువగా పిల్లలే. ముఠా తగాదాల కారణంగా ఈ బాంబు పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. చెత్త ఏరుకునే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. స్థానిక అధికార యంత్రాంగం, పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. లక్నో నుంచి అహ్మాదాబాద్‌కు ఫోరెన్సిక్ నిపుణులు హుటాహుటిన బయలుదేరారు. చెత్తకుండీ వద్ద కొంత మంది పిల్లలు అడుకుంటుండగా, బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. తక్కువ తీవ్ర గల బాంబు కావడంతో నష్టం భారీగా లేదని అంటున్నారు.