భోగి మంటల్లో అపశ్రుతి
Published on: Sun Jan 13, 2013 12:16PM

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలో ఆదివారం తెల్లవారుజామున భోగి మంటల వేడుకల్లో అపశ్రుతి జరిగింది. భోగి మంటలు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. భోగి మంటల్లో పేయింట్ డబ్బా వేయడమే ఈ ప్రమాదం జరగడానికి కారణంగా భావిస్తున్నారు.


