సీపీఐ, తెజసలకు తమ్మినేని ఆహ్వానం

 

తెలంగాణలో తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సంగతి తెలిసిందే.తెరాస ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ,సీపీఐ, తెజస పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి.అయితే  సీపీఐ, తెజస పార్టీలను తమతో చేతులు కలపవల్సిందిగా బహుజన వామపక్ష కూటమి (బీఎల్‌ఎఫ్‌) ఆహ్వానించింది.తాజాగా హైదరాబాద్ లో 14 మంది బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది.అనంతరం బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు బహుజన వామపక్ష కూటమితో చేతులు కలపాలని సీపీఐ,తెజస పార్టీలను ఆహ్వానించారు. ఆ రెండు పార్టీలు కలిసే పక్షంలో సీట్ల సర్దుబాటుకు తాము సుముఖంగా ఉన్నామని స్పష్టం చేశారు.మహా కూటమిని అర్థంలేని కూటమిగా అభివర్ణించారు.హామీలను నెరవేర్చని తెరాస ఓటమి భయంతోనే ఆంధ్ర, తెలంగాణ వాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.ఇప్పటివరకు బీఎల్‌ఎఫ్‌ 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.త్వరలో మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని కూటమి ఛైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌ తెలిపారు.