బాబా రాందేవ్ కొత్త బిజినెస్ ఇదే..!

ఎఫ్ఎంసీజీ మార్కెట్లో సంచలనాలు సృష్టించి దిగ్గజ కంపెనీల వెన్నులో వణుకు పుట్టించిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరో వ్యాపారంలోకి ప్రవేశించారు. "పరాక్రమ్ సురక్ష ప్రైవేట్ లిమిటెడ్" పేరుతో ఈ నెల 10 ఒక సంస్థను ప్రారంభించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరి వ్యక్తిగత రక్షణ కోసం, దేశ భద్రతా విధుల కోసం యువతను సిద్ధం చేయడమే తమ కంపెనీ లక్ష్యమన్నారు. అంతేకాకుండా తమ సంస్థ ద్వారా దేశంలోని 20-25 వేల మంది యువతకి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రిక్రూట్ చేసుకున్న యువతకు రిటైర్ ఆర్మీ, పోలీస్ అధికారులతో శిక్షణ ఇప్పించనున్నారు..హరిద్వార్‌లోని పతంజలి క్యాంపస్‌లో శిక్షణా కార్యక్రమం జరగనుంది.