విమానంలో మానభంగయత్నం
posted on Oct 16, 2014 11:17AM

ఓ విమాన ప్రయాణికుడు మరో ప్రయాణికురాలిపై విమానం గాల్లో వున్న సమయంలో టాయ్‌లెట్‌లో అత్యాచారయత్నం చేశాడు. హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన జరిగింది. హవాయి నుంచి విమానం బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు టాయ్‌లెట్‌లో జపాన్కు చెందిన ఓ ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడు. ఆ జపాన్ యువతి అతనితో తీవ్రంగా పోరాడి టాయ్‌లెట్లో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కింది. విమాన సిబ్బంది టాయ్‌లెట్ తలుపులు తీయడానికి తలుపులు కొట్టినా ఆ వ్యక్తి తలుపు తీయలేదు. దాంతో తలుపు స్క్రూలు ఊడదీసి ఆ యువతిని కాపాడారు. అయితే ఆ రేపిస్టుతోపాటు విమానంలో ప్రయాణిస్తున్న అతని తల్లి మాత్రం తన కుమారుడి మానసిక ఆరోగ్యం బాగా లేదని, అందుకే అలా చేశాడని అంటోంది. ఈ సంఘటన వల్ల విమానం వెనక్కి తిరిగి మళ్ళీ హవాయికి వెళ్ళిపోయింది. హవాయి పోలీసులు రేపిస్టును అరెస్టు చేశారు. అతనికి భారీ శిక్ష పడే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.