శాసనసభ ఎన్నికలు వాయిదా పడవు: ఈసీ

 

 

 

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలోనూ గడుపులోపే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శాసనసభ ఎన్నికలు వాయిదా పడుతాయని వార్తలు వస్తుండడంతో...ఎన్నికల కమిషన్ మీడియాకు ఓ లేఖను విడుదల చేసింది.

 

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని పేర్కొంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సీట్లు పెరగవని ఎన్నికల కమిషన్ పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం జూన్ రెండుతో ముగుస్తుందని, లోక్‌సభ పదవీ కాలం మే 20తో ముగుస్తుందని ఈసీ పేర్కొంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతే మార్పులు చేర్పులకు అవకాశముంటుందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.