ఏపీ విద్యుత్ ఉద్యోగులు వెంటనే విధుల్లోకి.. టీ సర్కార్
posted on Oct 23, 2015 5:45PM

ఎప్పటినుండో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తరువాత స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో రోజుల నుండి హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు రిలీవ్ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రిలీవ్ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నామని.. 1,252 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వీరికి చెల్లించాల్సిన వేతనాలను కూడా ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వాలు కలిసి చెల్లించనున్నాయి.