పంచాయతీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడి

 

Panchayat elections results, AP Panchayat elections results

 

 

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో ఫలితాలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో తొలుత వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఫలితాలను సాయంత్రం విడుదల చేస్తారు.

 

మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. గన్నవరం నియోజకవర్గం తుంటగుంట పంచాయితీ సర్పంచ్ గా టిడిపి బలపరిచిన జీ.రాణి 51 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News