పరిషత్తులను పట్టించుకునేవారేరీ?

 

 

 

గతంలో ప్రధాన పార్టీలు జిల్లా పరిషత్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఒకేసారి మున్సిపల్, పరిషత్, ఎంపీ, ఎమ్మె ల్యే ఎన్నికల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. నెలన్నర వ్యవధిలోనే అన్నింటి పోలింగ్ పూర్తి కానుంది. మొదట మున్సిపల్, వెంటనే పరిషత్, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు.

 

ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు స్థానిక ఎన్నికలను అంత గా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం పూర్తయ్యింది. గురువారంతో పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తవుతుంది. అయినా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు జిల్లా పరిషత్తుల విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. చాలాచోట్ల జడ్పీ పీఠంపై ఎవరిని నిలబెట్టాలన్న విషయమై పార్టీలు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాయి.తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు వేర్వేరు రోజుల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. ఈలోపే స్థానిక సందడి ముగిసిపోతుంది. అయినా కూడా ఆ ఎన్నికలమీదే దృష్టిపెడుతున్న నాయకులు.. ఈసారి మాత్రం జడ్పీ ఎన్నికలను అంతగా పట్టించుకోవట్లేదు.