అప్పటికల్లా అందరూ రావాల్సిందే.. చంద్రబాబు



సోమవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. చాలా సేపు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ను వదిలి రానంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు.. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి విజయవాడకు రావాల్సిందిగా తేల్చి చెప్పారు. అంతేకాదు ఈవిషయంలో ఎవరికి ఎటువంటి మినహాయింపు లేదని.. ఏపీ సచివాలయ ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉండాలన్న అభిప్రాయం మంత్రివర్గ సమావేశంలో వ్యక్తమైనట్టు సమాచారం. ఇక ఈ విషయంలో ఎటువంటి అలసత్వం వహించకుండా అందరూ ఉద్యోగులు బెజవాడ వచ్చే విషయంలో ఎంత మాత్రం ఉపక్షేంచకూడదన్న భావనకు మంత్రి వర్గం వచ్చినట్టు తెలుస్తోంది. కాగా రాజధాని అమరావతి ఇంకా అనేక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘ చర్చలు జరిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu