ఆంధ్రుల రాజధాని పేరు ‘అమరావతి’ ఖరారు
posted on Apr 1, 2015 3:54PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం పేరును ‘అమరావతి’గా ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు...
* పారిశ్రామిక విధానానికి ఆమోదం
* ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు
* 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్
* వ్యవసాయం, బయోటెక్ రంగాలకు ప్రోత్సాహకాలు
* 99 ఏళ్ల పాటు భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయం
* 100 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే ప్రత్యేక రాయితీలు
* స్వచ్ఛ్, గ్రీన్ ఏపీలకు సహకరిస్తే ఐదేళ్ల పాటు వ్యాట్, జీఎస్పీ రీయింబర్స్ చేయాలని నిర్ణయం
* ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు