రైతులను ఆదుకొనేందుకే రుణమాఫీ

 

రైతులను ఆదుకొనేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయాలని నిర్ణయించుకొన్నామని తెలిపారు. రుణ ఉపశమన పథకం రూపొందించేందుకు కోటయ్య కమిటీ వేశామని, అయితే కోటయ్య కమిటీ రూ. లక్ష రుణ మఫీ చేయాలని నివేదిక ఇచ్చిందని, కానీ తాము రూ. 1.5 లక్షల రుణ మాఫీ చేయాలని నిర్ణయం తీసుకొన్నామని స్పష్టం చేశారు. రుణవిముక్తితో పాటు ప్రాథమిక మిషన్ ను ప్రారంభించామని, ఇక్రిశాట్ తో కలిసి పని చేస్తామని తెలిపారు.