ఏపీలో అంబులెన్సులకు ఇక కొత్త రూపు, కొత్త రంగులు

ఆంధ్రప్రదేశ్ లో అంబులెన్సులు ఇక కొత్త రూపంతో కనిపించనున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అంబులెన్సులకు వేసిన నీలం రంగును తొలగించి.. తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులతో రిఫ్లెక్టివ్ టేపులతో అందుబాటులోకి తీసుకురావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించించింది. రూపం, రంగులు మార్చడమే కాదు అత్యాధునిక  సాంకేతిక పరికరాలను కూడా అమర్చి అంబులెన్సుల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా దూసుకువస్తున్నాయి. ఈ కొత్త అంబులెన్సులకు సంజీవని అనే పేరు ఖరారు చేశారు. వీటిపై ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఫొటోలు ఉంటాయి. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అత్యాధునిక సాంకేతకతతో అంబులెన్సులు మరింత సమర్ధవంతంగా సేవలు అందిచనున్నాయని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News