ఈ రోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 

ఈరోజు నుండి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులతో కూడిన బిఎసీ (బిజినస్ అడ్వజరీ కమిటీ)ఉదయం 8 గంటలకు సమావేశం అయ్యి, అసెంబ్లీ, సమావేశ తేదీలను అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఆమోదిస్తారు. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఈ సారి సమావేశాలలో చాలా ముఖ్యమయిన అనేక అంశాలపై చర్చ జరుగవలసి ఉంది. రాజధాని భూసేకరణకు చట్టబద్దత కల్పించడం, రాజధాని ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం, రాజధాని అధారిటీ (సి.ఆర్.డి.ఏ)కి చట్టబద్దత కల్పించడం వంటి అనేక ముఖ్యమయిన బిల్లులు ఆమోదించవలసి ఉంది. కానీ షరా మామూలుగానే ప్రదాన ప్రతిపక్ష పార్టీ వైకాపా ఈ సమావేశాలలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకొంటే, దానిని నిలువరించేందుకు అధికార తెదేపా సిద్దంగా ఉంది. కనుక ఈ సమావేశాలు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితమవవచ్చును. అందువలన కీలకమయిన బిల్లులపై ఎటువంటి చర్చ చేయకుండానే ఆమోదింపబడవచ్చును.