బ్రేకింగ్ న్యూస్.. ప‌ది, ఇంట‌ర్ ఎగ్జామ్స్ య‌థాత‌థం..

దేశమంతా ఒక‌లా. ఏపీలో మాత్రం మ‌రొక‌లా. క‌రోనా కేసుల తీవ్ర‌త దృష్ట్యా అనేక రాష్ట్రాల్లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు అయ్యాయి. సీబీఎస్ఈ సైతం ప‌ది ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది. తెలంగాణ‌లోనూ అంతే. కానీ, ఏపీలో మాత్రం ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ తెలిపారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని చెప్పారు. అయితే, తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్తుల‌కు సెల‌వులు ప్ర‌కటించారు. వారి విద్యా సంవ‌త్స‌రం పూర్తి అయిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు షెడ్యూల్ ప్ర‌కార‌మే ఉంటాయ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేయ‌డంతో విద్యార్థుల్లో, త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న పెరుగుతోంది. ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ వేళ ప‌రీక్ష‌లు పెడితే కేసులు మ‌రింత పెరుగుతాయ‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.