మరో సారి తెలంగాణలో ఐటీ సోదాలు
posted on Oct 17, 2024 12:11PM
హైద్రాబాద్లో 40 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ , అన్విత బిల్డర్స్, అధినేత అచ్చుత్ రావ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు గురువారం తెల్లవారు జామునుంచి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రాయదుర్గంలోని అన్విత బిల్డర్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అన్విత బిల్డర్స్ ఇటీవల ఫ్రీ లాంచ్ ఆఫర్స్ ప్రకటించి మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఐటీ అధికారుల వద్ద సమాచారం ఉంది. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఐటీ శాఖ ఆరోపించింది. రాత్రి వరకు ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉంది.