అంజలి దాగుడుమూతలు
posted on Apr 11, 2013 4:04PM
(1).jpg)
మూడు రోజుల క్రితం హోటల్ నుండి పారిపోయిన సినీనటి అంజలి ఇంకా తన దాగుడుమూతలు ఆటలు కొనసాగిస్తూనే ఉంది. ఈ రోజు తన సోదరుడు రవి శంకర్ కు ఫోన్ చేసి తానూ క్షేమంగానే ఉన్నానని రేపు మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు మాట్లాడాలనుకొంటున్నట్లు తెలిపింది. తానూ ఒంటరిగా లేనని తనకు తోడుగా మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపింది. తన వల్ల ఏనిర్మాత కూడా నష్టపోవడం ఇష్టంలేదని, కానీ హోటల్ రూములో తనను బాబాయి సూరిబాబు కొట్టడంవలననే పారిపోయానని త్వరలో వచ్చి షూటింగులో పాల్గొంటానని తెలిపింది. తను ఇక పిన్ని,బాబాయి ఇంటికి తిరిగి వెళ్ళే ప్రసక్తిలేదని వారు తనను చాల వేధిస్తున్నారని కూడా తెలిపింది.
పోలీసులు చెపుతున్న సమాచారం ప్రకారం ఆమె హోటల్ రూము నుండి బయటకి వెళ్ళిన గంటలోగా ఆమె ఫోన్ నుండి మొత్తం 18 ఫోన్ కాల్స్ వెళ్ళినట్లు తెలిసింది. ఆమె కోలీవుడ్ లో పలువురు నిర్మాతలతో, పాత్రికేయులతో మరియు ఒక వైద్యునితో మాట్లాడినట్లు తెలిపారు.
ఇక మరో వైపు ఆమె పిన్ని భారతి మద్రాస్ కోర్టులో తన కుమార్తెను తనకు తిరిగి అప్పగించవలసిందిగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఆమెను తామే పెంచాము గనుక ఆమెపై సర్వ హక్కులు తమకే ఉన్నాయని అందువల్ల ఆమెను తమకే క్షేమంగా అప్పగించవలసిందిగా తన పిటిషన్లో కోరింది.