కారాలు మిరియాలు నూరుతున్న కాలవ

అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎంపి కాలవ శ్రీనివాస్ పార్టీ అధినేతపై ఒకింత ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ తనను కరివేపాకులా వాడుకొని వదిలేస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనంతపురంలో ఈనాడు దినపత్రికకు చెందిన న్యూస్ టుడే విలేఖరిగా పనిచేసిన కాలవ శ్రీనివాస్ అనుకొని రీతిలో 1999లో పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అనంతపురంజిల్లాలో బిసిలకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. కాలవ శ్రీనివాసులు వల్మీకి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అప్పట్లో పయ్యాపుల కేశవ్ తదితరుల సలహాపై చంద్రబాబునాయుడు కాలవ శ్రీనివాస్ కు టిక్కెట్ ఇచ్చారు.

 

ఎవరూ ఊహించని విధంగా కాలవ శ్రీనివాస్ ఆ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత 2004-2005 ఎన్నికల్లో కూడా కాలవ శ్రీనివాస్ పోటీచేసినప్పటికీ ఓటమి పాలయ్యాడు. అయితే ఏ వర్గంలోనూ చేరకుండా పార్టీ అభివృద్ధికి కూడా పెద్దగా ప్రయత్నించకుండా ఉన్న కాలవ శ్రీనివాస్ క్రమేణా తెరమరుగవుతూ వచ్చారు. అయితే చంద్రబాబునాయుడు ఆయనకు మరో అవకాశం ఇచ్చే ఉద్దేశంతో పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అక్కడ కూడా ఆయన పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ తనను ఎమ్మెల్సీ చేయాలని కాలవ శ్రీనివాస్ పలుమార్లు చంద్రబాబునాయుడిని కోరారు. దీనికి అధినేత సానుకూలంగా స్పందించక పోవడంతో కాలవ శ్రీనివాస్ కారాలు మిరియాలు నూరుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu