ఆసుపత్రిలో చేరిన అమిత్ షా!!
posted on Sep 4, 2019 2:19PM

కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుపత్రిలో చేరారు. ముక్కుకు చిన్నపాటి సర్జరీ కోసం ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటీవల అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ కు చేరుకున్నారు. ఓ కుటుంబ కార్యక్రమం కోసం అహ్మదాబాద్ వచ్చిన అమిత్ షా.. నేరుగా అక్కడి నుంచి వైద్యం కోసం కేడీ ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. ఈరోజు సాయంత్రానికి అమిత్ షా డిశ్చార్జ్ కానున్నట్టు తెలుస్తోంది. కాగా జనవరిలో అమిత్ షా స్వైన్ ఫ్లూకి గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఛాతీ పట్టేసినట్టుగా ఉండడం, శ్వాస సంబంధిత ఇబ్బందులు రావడంతో ఎయిమ్స్ వెళ్లిన ఆయనకు.. స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు.