చంద్రబాబును పొగిడేసిన జానారెడ్డి
posted on Oct 17, 2015 5:09PM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాలు అందిస్తున్ననేపథ్యంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ జానారెడ్డిని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా జానారెడ్డి చంద్రబాబును ప్రశంసించారు. ఏపీ రాజధాని కోసం చంద్రబాబు చేస్తున్న కృషి, పట్టుదల ఎనలేనిదని.. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు బాగా శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. ఇదిలా ఉండగా జానారెడ్డిని కలిసిన మంత్రులు కూడా జానారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ శాసనసభలో విపక్ష నేతగా ఉన్న జానారెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించారని.. రాజధాని శంకుస్థాపనకు వస్తానని చెప్పారని అన్నారు. కానీ ఏపీ ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మాత్రం రానంటున్నారని జగన్ ఇంత మూర్ఖుడు అని అనుకోలేదని వారు అన్నారు.