కోర్ కమిటీ భేటి ప్రారంభ౦, సర్వత్రా ఉత్కంఠ

 

Congress Core Committee, All eyes on Congress core committee meeting

 

 

కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్‌మోహన్ సింగ్ నివాసంలో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ ఆంటొనీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందుగానే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు చేరుకున్నారు.


మరోవైపు ప్రధాని నివాసం ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి, సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. విభజించాలని ఓయు నేతలు, విభజించవద్దంటూ సీమాంధ్ర విద్యార్థి నేతలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ అంశంపై కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.