అమ్మాయిలూ.. లైబ్రరీకి వెళ్ళండి...

 

ఆమధ్య అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం వీసీ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా అమ్మాయిల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన అమ్మాయిలను లైబ్రరీలోకి వెళ్ళరాదంటూ ఆదేశించారు. అదేంటని అడిగితే, అమ్మాయిలను లైబ్రరీకి అనుమతిస్తే, ఎంతమంది అమ్మాయిలు లైబ్రరీలో వుంటే అంతకు నాలుగింతలు అబ్బాయిలు లైబ్రరీకి వస్తారని, అప్పుడు అక్కడ స్థలం సరిపోదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యల మీద దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలకు సారీ చెప్పాలని ఆయన మీద ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన మాట వినలేదు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఈ విషయంలో వీసీకి మొట్టికాయలు వేసేసరికి ఆయన దారికి వచ్చారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో అమ్మాయిలు కూడా లైబ్రరీకి వెళ్ళొచ్చంటూ ఆదేశాలు జారీ చేశారు.