గాంధీ ఆసుపత్రిలో అక్బరుద్దీన్

 

Akbaruddin Owaisi Hate Speech, Akbaruddin Owaisi arrest, Akbaruddin reaches Gandhi Hospita, Akbaruddin health test

 

 

ఎట్టకేలకు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి రావాలని ఈ ఉదయం పోలీసులు అక్బరుద్దీన్ నివాసం వద్ద నోటీసులు జారీ చేశారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున పోలీసుల ముందు హాజరయ్యేందుకు నాలుగు రోజుల గడువు ఇవ్వాలని అక్బరుద్దీన్ కోర్టు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఓ సారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.



గాంధీ ఆసుపత్రిలోని అత్యవసర చికిత్సల విభాగంలో అక్బరుద్దీన్ కు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల వివరాలు ఈ మధ్యాహ్నం బయటకు వస్తాయి. ఆ తరువాత అరెస్టు మీద నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరో వైపు అక్బరుద్దీన్ ఇంటి నుండి గాంధీ అసుపత్రి వరకు భారీగా పోలీసులను మోహరించారు. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, నేతలు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.