అగస్టా స్కాంలో కొత్త ట్విస్ట్.. ఎరగా అందమైన అమ్మాయి

 

అగస్టా స్కాంలో రోజుకో ఆసక్తికర విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఈ స్కాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలతో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగి ఇప్పటికే ఈడీ విచారణలో ఉన్నారు. అయితే గతంలో ఈ కేసులో మధ్యవర్తిగా ఉన్నవారు త్యాగిని అపురూప లావణ్యవతి అనే కోడ్ నేమ్ తో పిలిచుకునేవారు అన్న విషయం బయటకు రాగా ఇప్పుడు.. మరో అందమైన అమ్మాయిని కూడా వాడుకున్నట్టు తెలుస్తోంది. రూ.3,200 కోట్ల విలువ కలిగిన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు గాను ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ ల్యాండ్ అనే కంపెనీ డబ్బుతో పాటు అందాల భామను కూడా ఎరగా వేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

 

ఈస్కాంలో మద్యవర్తగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ క్రిస్టిన్ బ్రెడో స్ల్పిడ్‌ అనే లండన్ యువతిని పావుగా వాడుకున్నట్టు తెలుస్తోంది. మొదట తన కంపెనీలో ఆమెకు డైరెక్టర్ పదవిని ఇచ్చిన మైఖేల్ ఆ తర్వాత అగస్టా కుంభకోణంలో ఆమెను ఎరగా వేశాడు. డబ్బులో పాటు ఎంతో సౌందర్యవతి, అందగత్తె క్రిస్టిన్ బ్రెడో స్ల్పిడ్‌‌ను ఎరగా వేయడంతో భారత్‌కు చెందిన అధికారులతో పాటు రాజకీయ నేతలు డబ్బుతో పాటు ఆమె అందానికి దాసోహమైపోయి కాంట్రాక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu