అజ్ఞాతవాసికి ఏపీ ప్రభుత్వం అనుమతి....

 

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా రేపు విడుదలకానున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా హంగామా అప్పుడే మొదలైంది. ఇక పవన్ అభిమానులైతే సినిమాకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా స్పెషల్ షో ల ప్రదర్శన కి ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ సినిమాకి మామూలు షో లతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల దాకా అదనపు షో లు వేయడానికి హోమ్ శాఖ ప్రత్యేక అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అజ్ఞాతవాసి సినిమాకు ఈ నెల 10 నుంచి 17 దాకా ప్రత్యేక అనుమతి వర్తిస్తుంది.