కుదుటపడని రోజా ఆరోగ్యం

 

 

 

ఈ ఎన్నికలలో సినీ నటి రోజా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో వున్న విషయం, శుక్రవారం నాడు ఎండలో తిరుగుతూ ప్రచారం చేస్తూ వడదెబ్బకి గురైన విషయం తెలిసిందే. అయితే నిన్నంతా చికిత్స చేసినప్పటికీ వడదెబ్బ నుంచి రోజా కోలుకోనట్టు తెలిసింది. ఈసారి అయినా గెలుస్తానా లేదా అనే భయంతో రోజా ఎండని కూడా లెక్క చేయకుండా టూమచ్‌గా ప్రచారం చేయడంతో సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయిన రోజాని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు శ్రమపడి రోజాని స్పృహలోకి తెచ్చారు. వడదెబ్బ కారణంగా రోజా బాగా బలహీనమైపోయారని, ఇంకో రెండు మూడు రోజులైనా ఆస్పత్రిలో వుండక తప్పదని వైద్యులు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే రోజా ప్రచారంలో వెనుకబడిపోతానని, అంచేత బయటకి వెళ్ళి ప్రచారం చేస్తానని పట్టుబట్టగా, ట్రీట్‌మెంట్ పూర్తి కాకుండా బయటకి వెళ్ళి ప్రచారం చేస్తే అంతే సంగతులని వైద్యులు హెచ్చరించడంతో రోజా ఆస్పత్రిలోనే వుండటానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News