పింఛన్ల కోసం రూ.2,737.41 కోట్లు విడుదల

ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీకి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 2 వేల 737. 41 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 54.82లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు గురువారం (ఆగస్టు 1)  ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ఆరంభమౌతుంది.

ఇందు కోసం గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తారని సీఎస్ నీరభ్ కుమార్ తెలిపారు. గురువారం అంటే ఆగస్టు 1న 99 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అవుతుందనీ, ఆ మరుసటి రోజు అంటు ఆగస్టు 2తో వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతుందని వివరించారు.  ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున అందుతాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu