జమాతే-ఇస్లామీ చీఫ్‌ను ఉరి తీసిన బంగ్లా ప్రభుత్వం
posted on May 11, 2016 4:25PM

బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీ జమాతె-ఇస్లామీ చీఫ్ మోతిమర్ రెహమన్ నిజామీని ఆ దేశ ప్రభుత్వం ఉరి తీసింది. 1971లో బంగ్లాదేశ్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో నేరాలకు పాల్పడినందుకు బంగ్లా సుప్రీంకోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఊచకోత, రేప్ కేసుల్లో నిజామి చాన్నాళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆయన క్షమాభిక్ష పెట్టుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిన్న అర్థరాత్రి ఢాకా సెంట్రల్ జైలులో ఉరి తీశారు. ఆయన ఉరితీతకు వ్యతిరేకంగా జమాతె పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. దీంతో ఢాకాలోని ప్రధాన నగరాల్లో వేలాది మంది పోలీసులతో భద్రతను పెంచారు. రెహమన్ మృతిని డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన మృతదేహన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రెహమన్ స్వస్థలమైన సతియా ప్రాంతానికి పంపించారు.