ఉత్తరా(మా)యణం

 

 

.......కె. శివరామకృష్ణ

 

 

రాశాను ప్రేమలేఖలెన్నో... దశాను ఆశలెన్నో.. అంటూ ప్రణయ గీతం వినపడాలే కానీ కాలం యవనంలోకి తొంగి చూడని వారు ఉండరు! ఇప్పుడైతే.. చేశాను ఎస్ఎంఎస్ లెన్నో.. పంపాను ఊసులెన్నో' అంటూ ఈ తరం నాయకానాయికలు ' లవ్ ' చిందులేస్తారు. 'సెల్' కాలమొచ్చి నిద్రలేచావా' అంటూ మేల్కొలుపులు, సుప్రబాతం పలికి.. మంచిగా నిద్రపో' అంటూ పవళింపు సేవవరకు ఎప్పటికప్పుడు 'సొల్లు' తున్నారు కానీ.. ఇంతకుమునుపైతే.. అన్నింటికీ లేఖలతోనే రాయభారం నడిచేది చివరకు రాజకీయాల్లో నిర్ణయాలు, ప్రతిస్పందనలు కూడా లేఖల్లోనే బట్వాడా. అప్పట్లో.. రాజకీయ ప్రేమలేఖలు వెలుగు చూడడానికి నాలుగైదు రోజులు పట్టేది. ఎవరో ఒక లీకువీరుడు ఉప్పదించేదాక తాజా కబురు బయకి పొక్కెది కాదు. రాజకీయం స్పీడ్ పెరిగాక. అక్కడ లేఖ రాయడం ఇక్కడ లీకు చేయడం అంతా అరగంటకో వార్త బులిటెన్ సాక్షిగా బహిరంగ రహస్యమవుతుంది ! రాజకీయం ముదురు పాకాన పడే కొద్ది లేఖల్లో అక్షరాలు ఆయుధాలుగా మారతాయి ! ఈ అక్షరాలే శిలాఘాతాలై రాస్తాల్ని విభజించే పాశుపతాస్త్రాల అవుతాయనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణ. యూపీఎ నిర్ణయానికి ఆధారమైన కాంగ్రెస్ వర్కింగ్ పార్టీలన్నీ లేఖలు ఇచ్చాకనే మేం నిర్ణయం తీసుకున్నాం. అని ! భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టే సత్తా అక్షరానికి ఉందా.. అనుమానం ఉంటె ఏ కాంగ్రెస్ కామందుడినడిగినా ఎదే చెబుతాడు.

 

విభజన లేఖలు, సమన్యాయం లేఖలు, రాజ్యాంగాన్ని కాపాడాలని ఆక్రోశించే లేఖలు. అఫిడవిట్లతో  లేఖలు, బహిరంగ లేఖలు అన్నీఇన్నని కాదులే! ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా బోలెడు లేఖలు, కానీ ప్రేమలేఖల మతలబే  వేరు! ప్రేయసికైనా శ్రీమతికైనా లేదా శ్రీవరికైనా రాసే లేఖలో ప్రియాఅన్న పిలుపు నుంచి ఇట్లు నీ ప్రియసఖి /సఖుడు' అనేంతవరకు ప్రతి అక్షరం ప్రేమపాశమే. వరసమారితే ఈ ప్రేమదాసులే దేవదాసులన్నది వైన్షాపులకెరుక!

ఆరోపణలు, రాజీనామాలతో లేఖలు రాసే రాజకీయ గోవిందయ్యలు కూడా ఈ  మధ్య ప్రేమలేఖలని పలవరిస్తున్నారు! షోకాజ్ల్ని, రాజీనామాల్ని ప్రేమిస్తున్నారు! విభజన నిర్ణయానికి సీమాంధ్రలో కాంగ్రెస్ చచ్చిపోయిందోచ్' అంటూ ఎదురైనా వారినల్లా గిల్లి మరీ చేబుతున్న జేసి దివాకర్ రెడ్డికి అధిష్టానం షోకాజ్ ఇచింది. పార్టీ పరువు బాగున్నడితే ,ఏమిటప్పా సంగతి ' అంటే అదేదో మా కుటుంబ వ్యవహారం లే అన్నట్టుగా నేతా శ్రీ బదులిచ్చే వారు. 'వేటుకు వేళయరా'  అని కోడై కూసే శికాజ్ కూడా ప్రేమలేఖ గా కనిపించింది. ఈ లెటర్, లో విరసమే ఉంటుందని తెలిసినా లేఖను ప్రేమించడం నేతాగణానికే చెల్లుతుంది. తన శాఖా మార్చాలని అలిగిన శ్రీధర్బాబు ఎడం చేత్తో పమపిన రాజీనామా గురించి సీఎం ను అడిగితె ' ఆ లేఖే కాదు.. చాలా ప్రేమలేఖలు అందుతున్నాయి అంటారు! ఈ లెక్కన ప్రేమలేఖల్ని రాజకీయనాయకులు తెగ ప్రేమించేస్తే ప్రేమికులేమైపోవాలి! వారి ప్రేమాయణం ఏం కావాలి!

మనసుకింత హాయినిచ్చే కబుర్లు మోసుకొచ్చే ఉత్తరం ఇచ్చే పోస్ట్ మ్యానే కరువయ్యాడు! ఎక్కడన్నా.. అడపా దడపా పోస్ట్లు వినిపిస్తున్నాయే కానీ ఇవి తంతి తపాలా కార్యాలయం పోస్ట్లు కావండోయ్! అవన్నీ ట్విట్టర్,పేస్ బుక్, గూగుల్ ప్లస్,ఆర్కూట్ పోస్ట్లు. పోస్ట్లు రెండు కూడా ఊసుల మోపులే కానీ రెండింటికి కొంచం ధర్మబేధముంద.

తపాలా లేఖను చిరునామాదారులే చదువుకుంటారు. ఇంటర్నెట్లో చేసే పోస్ట్ల్ల్ని విశ్వదర్శనం చేయిస్తారు. ఎవరు పోస్ట్ చేసినా మిగిలిన నెట్జీవుల్ని చూస్తాయి. వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో  పోస్ట్ని కాస్తా కామెంట్ భారతం' చేస్తాయి.  ఎన్నికల ప్రచారంలో నాయకులకు మైలేజీ ఇవ్వడంలోనూ' ఈ పోస్ట్'ల తీరే వేరు. కాంగ్రెస్, బీజెపి నాయకులైన దిగ్విజయ్, మోదీల మధ్య పోట్లా(స్ట్) ట నెటిజన్లను కూడా విభజన చేయడం షరా మామూలే! లక్ష కోట్లపై పేటెంట్ ఉన్న నాయకుడు ' సోనియమ్మను నేను నేను అడుగుతున్నా' అని ప్రశ్నించాగానే నెటిజన్లు కూడా ' నేను అడుగుతున్నా' అంటూ పేరడీ ప్రశ్నలతో పోస్టెత్తించారు. ల్యాండ్ ఫోన్ల పై మొబైల్ లా దాడి పెరిగాక తట్టి తపాలాశాఖ కాస్తా తంతే 'టపాలా శాఖగా' మారింది.  ఆ శాఖ ఉండేదంనట్టుగా  గోడకు వేలాడదీసిన తీగకు  గుది గుచ్చిన ఉత్తరాలే సాక్షి. హైటెక్ కాలంలోనూ ఉత్తరాలేంటి ? అని నొసలు చిట్లించబోయి మౌస్ క్లిక్ చేస్తాం కానీ..! అక్షరానిది అక్షయశక్తి. అక్షరాలను వెతుకుతూ ముందుకు పరిగెత్తే చూపుల వెనుక మనసు ఉరుకెత్తుతుంది. తోచినప్పుడల్లా లేఖాగుచ్చంలోని ఊసుల్ని నెమరవేసుకోవచ్చు. ఈ ముద్రణాలవల్లే 24 గంటల పాటు వార్తా ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీవీ చేనెళ్ళు ఎన్ని వచ్చినా పత్రికలు' నెట్' కొస్తున్నాయి. ఏతావాతా ఉత్తరాలు బట్వాడా చేసే తపాలాశాఖ ఇటివలే కలం చేసిన ' టెలిగ్రామ్ ' లాగా టపా కట్టేయకుండా బతికి బట్టకట్టాలని ఉత్తర ప్రియుల ఆరాటం! ఇదంతా ఎందుకంటారా ' 'ఉత్తరామాయణ' కలం గుర్తుకొచ్చి ఉత్తి పుణ్యానికి చెప్పా!