కాంగ్రెస్ అభిప్రాయం చెప్పకుంటే నిలదీస్తాం: యనమల

 

TDP Telangana, TDP all party meeting,  TDP on Telangana, TDP congress

 

 

తెలంగాణపై జరగనున్న అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరుపున ఎవరు వెళ్ళాలన్న విషయం పై కరీంనగర్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో ఇరు ప్రాంతాల పొలిట్ బ్యూరో సభ్యులు సుదీర్ఘ౦గా చర్చించిన తరువాత ఓ నిర్ణయానికోచ్చినట్లు తెలుస్తోంది.

 

చర్చ అనంతరం యనమల మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నేత ప్రతినిధిగా యనమల రామకృష్ణుడు, తెలంగాణ నుండి కడియం శ్రీహరిలు అఖిల పక్ష సమావేశానికి వెళ్లనున్నట్లు చెప్పారు. తాము కొన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించామని, తామిద్దరం ఒకే అభిప్రాయాన్ని చెప్తామని, అదే సమావేశంలో కాంగ్రెసు పార్టీ వైఖరిపై తాము నిలదీస్తామన్నారు. తమ పార్టీ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ రూపంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అందజేస్తామన్నారు.



2008లో రాసిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తాము ఆ లేఖను వెనక్కి తీసుకోలేదన్నారు. అఖిల పక్ష సమావేశం ముగిసిన తర్వాత కేంద్రం తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెసు అభిప్రాయం చెప్పకుంటే అన్ని పార్టీలు నిలదీయాలన్నారు.