శ్రీనువైట్ల కి ఎన్టీఆర్ సెంటిమెంట్
posted on Apr 11, 2013 1:19PM

నందమూరి తారకరామారావుగారి ప్రస్తావన నా సినిమాల్లో సెంటిమెంట్‌గా మారింది. 'రెడీ'లో మామూలుగానే పెట్టాను. కానీ 'దూకుడు'లో ప్రకాష్‌రాజ్ అభిమానించే వ్యక్తిగా నాకు ఎన్టీఆర్‌గారు తప్ప మరెవరూ గుర్తుకురాలేదు. ఈ సినిమాలో మాత్రం సెంటిమెంట్‌గానే పెట్టాను. తెలంగాణ యాసలో మాట్లాడించిన డైలాగులకు చాలా మంచి స్పందన వస్తోంది. తారక్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. జస్టిస్ చౌదరి గెటప్‌నకు కూడా ఈ సినిమాలో మంచి స్పందన వస్తోంది. తారక్ కూడా ఎగ్జైట్ అయి చేశాడు. నాజర్ పాత్రను అందరూ మెచ్చుకుంటున్నారు. బ్రహ్మానందంగారు ఫోన్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేనెప్పుడూ హీరోని దృష్టిలో పెట్టుకునే కథ చేస్తాను. నేను ఏ సినిమా చేసినా వినోదాన్ని మిస్ కాను. అన్ని వర్గాల వారినీ అలరించేసినిమా చేయడమే నా ధ్యేయం.