రామ్ చరణ్ 'ఎవడు' న్యూ ఫొటోస్ సూపర్
posted on Jun 26, 2013 3:37PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ఎవడు' మూవీ షూటింగ్ శరవేగంగా జరుతున్న సంగతి తెలిసిందే. జూలై చివరికల్లా సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్, శ్రుతి హాసన్ పై మంచి మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. 'ఎవడు' సినిమా న్యూ స్టీల్స్ కొన్ని ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. ఈ స్టీల్స్ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ న్యూ లుక్స్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చరణ్ కి తగిన జోడిగా శ్రుతి హాసన్, అమీజాక్సన్ ఆకట్టుకుంటున్నారు. ‘ఎవడు' చిత్రం ఆడియోను జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
.jpg)