చచ్చి బతికిన అవయవదాత
posted on Sep 10, 2012 6:32PM
మన శరీరంలోని అవయాలను మనం బతికుండగా దానం చెయ్యడం కొద్దిగా కష్టమే! కాదనలేం! కానీ`మనం చనిపోయిన తర్వాత ఆ అవయవాలను అవసరమైన వారికి అమరిస్తే` మరోప్రాణం నిలబెట్టిన వారమౌతాం! సరిగ్గా అదే చేశాడో ఎనభై ఎనిమిదేళ్ళ వృద్ధుడు! అనారోగ్యంతో బాధపడుతున్న ఢల్లీికి చెందిన తేజ్‌రామ్(88) అనే ఆయన తన మరణానంతరం తన అవయవాలను పేదలకు దానం చెయ్యాలని లేఖ రాశాడు. సెప్టెంబర్ మూడో తేదీన ఆయన మరణించడంతో గంగారామ్ ట్రస్ట్‌వారు తేజ్‌రామ్ దేహంలోని కాలేయం, కిడ్నీలను సేకరించి, ముగ్గురు పేదలకు పునర్జీవితాన్ని ప్రసాదించారు. కాలేయాన్ని ఓ 35ఏళ్ళ వ్యక్తికి అమర్చగా, మరో ఇద్దరికి తేజ్‌రామ్ కిడ్నీలను అమర్చారు. దాంతో వీరు ముగ్గురు పరిపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. అవయవాలను దానం చేసిన అత్యంత వయోవృద్ధుడిగా రికార్డుల కెక్కిన తేజ్‌రామ్ ఎందరికో స్ఫూర్తి! మన మరణానంతరం కూడా మరొకరికి బతికే అవకాశం కల్పించే అవయదానం ఆహ్వానించదగిన, ఆచరించదగిన మంచి నిర్ణయం! మానవత్వానికి నిజమైన నిదర్శనం!