ఎస్సీ సంక్షేమ కమిటీకి దిశానిర్దేశం చేసిన స్పీకర్‌?

నిన్నటిదాకా అంటరానితనం...నేడేమో అత్యాచారాలు, బెదిరింపులు...వంటి పలు సంఘటనలు ఎదుర్కొంటున్న ఎస్సీ(షెడ్యూల్డుకులా)లు సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం శాసనసభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీి జిల్లాల్లో పర్యటించనున్నది. ఈ నేపథ్యంలో కమిటీలోని సభ్యులకు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ కమిటీ సేవలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రతీచోటా పబ్లిక్‌హియరింగ్‌ పెట్టాలని సూచించారు. అర్జీలు తీసుకోవటమే కాకుండా అవసరమైతే అత్యాచారబాధితులను, సాక్షులను పిలిపించి మాట్లాడాలని కూడా కోరారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం 11వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రజాప్రతినిధులు జిల్లాల్లోని సంక్షేమవసతిగృహాల్లోనే బస చేయాలని సూచించారు. వేదనభరితమైన పరిస్థితులు చక్కదిద్దేందుకు కమిటీ కృషి చేయాలన్నారు. కమిటీ ఛైర్మను అబ్బివెంకటస్వామి, మంత్రులు శ్రీధర్‌బాబు, శైలజానాధ్‌, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ తదితరుల సమక్షంలో కమిటీ సభ్యులకు స్పీకర్‌ నాదెండ్ల క్లాసు పీకారు. రాష్ట్రానికే కీలకమైన కమిటీ ఇదంటూ స్పీకర్‌ చేసిన హడావుడి ఎస్సీ ఓట్లకు కాంగ్రెస్‌ పార్టీ వేసే గేలంలా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిసి డిక్లరేషను ప్రకటించినందున కాంగ్రెస్‌ పార్టీ ఈ కమిటీ కార్యకలాపాలను సీరియస్‌గా తీసుకుంటున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu