ఆవిర్భావ సభలో ఆకట్టుకోని కిరణ్ ప్రసంగం

 

 

 

తూర్పు గోదావరి జిల్లా జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. కిరణ్ చేసిన ప్రసంగం చాలా చప్పగా సాగడంతో వచ్చిన ప్రజలు, కార్యకర్తలు నిరసి౦చిపోయారు. కాంగ్రెస్ అధిష్టాన౦పై పాత పాటనే కిరణ్ మళ్ళీ వినిపించారు. రాష్ట్ర విభజనకు ఎవరు సిపార్సు చేస్తే విభజించారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఈ రీతిలో విభజించడం సమంజసమా? అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర, తెలంగాణ విద్యార్ధులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలలో ఇబ్బందులు వస్తాయని అన్నారు. గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తెలియదని అన్నారు. రాష్ట్ర విభజనకు పెద్ద బాబు చంద్రబాబు, చిన్న బాబు జగన్ బాబు ఇద్దరూ లేఖలు ఇచ్చారని గుర్తు చేశారు. విభజనను ఎలా చెయ్యాలి అనేది కూడా చిన్న బాబు జగన్ లేఖలో వివరించి పంపించారని అన్నారు. మరోవైపు ఇతర పార్టీ అధ్యక్షులపై పదునైన విమర్శలు చేయడంలో కిరణ్ విఫలమయ్యారు. సభకు వచ్చిన కార్యకర్తలో, ప్రజల్లోను ఉత్సాహాన్ని ని౦పలేకపోయారు. ఇదే తీరుగా కిరణ్ తన ప్రసంగాలతో ప్రజల్లోకి వెళితే పార్టీకి గుర్తింపు రావడం కూడా కష్టమేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.                   

 

సభ హైలైట్: సమైక్యాంద్ర పార్టీ సభను నిర్వహిస్తున్న ఒక నేత ఒకటికి పదిసార్లు రోడ్డుమీద ఉన్నవారంతా సభ ప్రాంగణంలోకి రావాలని కోరడం విశేషం.