కేజ్రీవాల్‌ కారు చోరి...

 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కారును దొంగలు ఎత్తుకుపోయారు. నీలిరంగు వ్యాగన్‌-ఆర్‌ కారును సెక్రటేరియట్‌ దగ్గరనుంచి దొంగలు అపహరించుకపోయారని సెంట్రల్‌ ఢిల్లీ డిసిపి చెప్పారు. గురువారం మధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో ఆ కారును ఎవరో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చోరీ చేశాడ‌ని సమాచారం. ఆ కారుని ప్ర‌స్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాలంటీర్లు ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది. దీంతో ఒక ముఖ్య‌మంత్రి కారు అది కూడా ఢిల్లీలోని స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోనే చోరీ కావ‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది.