అమ్మకు రెండోసారి అంత్యక్రియలు...
posted on Dec 14, 2016 9:44AM

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆమెకు మెరీనా బీచ్ ఎంజీఆర్ ఘాట్ పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇప్పుడు మరోసారి జయలలితకు అంత్యక్రియలు నిర్వహించారు. జయలలితకు వరుసకు సోదరుడయ్యే వరదరాజు కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో పవిత్ర కావేరీ నది ఒడ్డున పశ్చిమవాహినిలో రెండోసారి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సోదరి నాస్తికురాలు కాదని...ఆమె హిందూ ఆచారాలను గట్టిగా పాటిస్తారని... అందుకే ఆమెకు మళ్లీ అంత్యక్రియలను నిర్వహించామని చెప్పారు. జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఓ బొమ్మను చేయించి, దానికి అంత్యక్రియలు నిర్వహించారు.
చెన్నైలో జయ అంత్యక్రియలను హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించలేదని... ఆమెను దహనం చేయకుండా, ఖననం చేశారని... దీంతో ఆమె ఆత్మకు మోక్షం లభించదని... అందుకే ఆమెకు మళ్లీ అంత్యక్రియలు నిర్వహించామని ప్రముఖ పూజారి రంగనాథ్ అయ్యంగార్ తెలిపారు.