జగన్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

 

 

jagan congress, congress harsha kumar, harsha kumar jagan parti, Congress kgbas gas

 

అమలాపురంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. అమలాపురంలో జరిగిన మన గ్యాస్- మన హక్కు పేర నిర్వహించిన అఖిల పక్ష సదస్సులో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ జగన్ పార్టీ నేత శెట్టిబత్తుల రాజబాబును వేదికపై నుంచి కిందికి తోసేశారు.


ఎంపి హర్షకుమార్ ప్రసంగిస్తుండగా, వైఎస్ఆర్ సీపీ నేత రాజబాబు అడ్డుపడి తొమ్మిదేళ్లుగా ఈ సమస్యపై ఎమ్.పి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.ఈ సదస్సును కాంగ్రెస్ సమావేశంలా నిర్వహించడం ఏమిటని నిలదీశారు. దాంతో ఎంపీ అనుచరులు రెచ్చిపోయారు. రాజబాబును వేదిక నుంచి కిందికి తోసి దాడికి పాల్పడ్డారు. అనుచరులతో పాటు హర్షకుమార్ కూడా చేతులు కలిపారని చెబుతున్నారు.
ఎంపి హర్షకుమార్, ఆయన తనయుడు పై  వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు పిర్యాధు చేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu