ఢిల్లీ వన్డే మ్యాచ్: ఇండియా 167 ఆలౌట్

Publish Date:Jan 6, 2013

 

 India all out for 167, India Pakistan, India all out for 167 Pakistan, India's sorry state continues

 

 

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాక్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 167 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్‌మన్‌లందరూ ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి పెవిలియన్‌కు చేరారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 43.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ ధోనీ 36, రైనా 31, జడేజా 27, యువరాజ్ 23, గంభీర్ 15 పరుగులు చేయగా మిగిలిన వారందరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో అజ్మల్ 5 వికెట్లు పడగొట్టగా, ఇర్ఫాన్ 2, జునైద్, ఉమర్ గుల్, హఫీజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.