నాగపూర్ టెస్ట్ : తొలి రోజు ఇంగ్లాండ్ 199/5

Publish Date:Dec 13, 2012

 

 england india, england nagpur test, india nagpur test, england india 2012

 

నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇండియా బౌలర్ల జోరు కొనసాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆదిలోనే దెబ్బతగిలింది. మూడు పరుగులకే ఇషాంత్ శర్మ కాంప్టన్ వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఈ సిరీస్ లో సెంచరీలు మీద సెంచరీలు చేస్తున్న కుక్ ను కూడా శర్మ అవుట్ చేశాడు.


లంచ్ బ్రేక్ తరువాత నిలకడగా రాణిస్తున్న ట్రాట్ 44 పరుగుల వద్ద జడేజా అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ 119 పరుగుల బెల్ (1) తొందరగానే అవుటయ్యాడు. డేంజర్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్న పీటర్సన్ 73 పరుగులకు జడేజా అవుట్ చేసి ఇంగ్లాండ్ ని కోలుకొని దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు రూట్ 31, ప్రయర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇ షాంత్, జడేజాలిద్దరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.